ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సోమవారం వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి కూలీలను వాహనాలలో పరిమితికి మించి ఎక్కించుకొని వెళ్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మందలించారు. అధిక మొత్తంలో వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగితే ప్రాణా నష్టం జరిగే అవకాశం ఉందని మళ్లీ ఇటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వాహన డ్రైవర్లకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని తెలిపారు.