పాణ్యం: ఓర్వకల్లు: ఏపీఐఐసీ భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి : రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ
ఓర్వకల్లు మండలంలో ఏపీఐఐసీ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ నేతృత్వంలో రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో రైతులు జేసీకి వినతిపత్రం సమర్పించారు. పేదలకు తగినంత పరిహారం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతుల భూములు సర్వే చేసి న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.