అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకునాలుగవ విడత రీసర్వే చేపట్టడంలో భాగంగా బూదిగుమ్మ , అంకంపల్లి మరియు కాలువపల్లి గ్రామములను ఎంపిక చేయడమైనదని మండల తహసిల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రీసర్వే యొక్క ప్రాముఖ్యతను రైతులు అవగాహన కల్పించడమైనది. రీసర్వే డిప్యూటీ తహసిల్దార్ గురుబ్రహ్మ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమములో వి ఆర్ ఓ లు, వి ఆర్ ఏ లు, గ్రామ సర్వేయర్లు రైతులు పాల్గొన్నారు.