నగదు రూ. 50 వేల కంటే ఎక్కువ ఉంటే సీజ్ చేసిన నగదు, వస్తువులకు రసీదు ఇవ్వాలి: కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
Eluru, Eluru | Apr 11, 2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే వెంటనే సీజ్ చేయాలని గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నగదు ఎన్నికలకు సంబంధించినదని తేలితే, వెంటనే సీజ్ చేసి, కేసు నమోదు చేయాలని, ఎన్నికలతో సంబంధం లేకపోతే, జిల్లా గ్రీవెన్స్ కమిటీకి నివేదించాలన్నారు. స్వాధీనం చేసుకున్న నగదు లేదా వస్తువుల వివరాలను నమోదు చేసి, వాటి యాజమానికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని స్పష్టం చేశారు.