రెడ్డిపల్లిలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి నుంచి పాముదుర్తికి వెళ్లే రహదారి పక్కన కంచె లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని మంగళవారం సాయంత్రం స్థానికులు తెలిపారు.. రోడ్డు మార్జిన్లోనే ట్రాన్స్ ఫార్మర్ను బిగించటంతో వాహనదారులు ఆదమరిచినపుడు ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలతో పాటు మూగజీవులు నిత్యం అటువైపు వెళ్తుంటాయి. పలుమార్లు ప్రమాదాలు జరిగినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు.