ఆర్మూర్: డ్రగ్స్ గంజాయిని నిర్మూలించాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన పి ఓ డబ్ల్యు పివైఎల్ నాయకులు
డ్రగ్స్ ను గంజాయిని నిర్మూలించాలని ఆర్మూర్ పట్టణంలో సబ్ కలెక్టర్ కు పివైఎల్ పి ఓ డబ్ల్యు నాయకులు శనివారం మధ్యాహ్నం 2:40 వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ మాట్లాడుతూ యువత డ్రగ్స్ గంజాయి మత్తు ఉచ్చులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను కుటుంబాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలను నిర్మూలించి యువత భవిష్యత్తును కాపాడాలని కోరారు.