మహేశ్వరం: లక్ష్మాపురంలో ప్రేమించి మోసం చేశాడని ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలి మౌన పోరాటం
సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని లక్ష్మాపురం కు చెందిన మల్లెపాక నాగరాజు హైదరాబాదులోని అంబర్పేటలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటికి చెందిన యువతని ప్రేమించాడు. గురువారం బాధిత యువతి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తనను ప్రేమించి తాను లేకుంటే జీవించలేనని మాయమాటలు చెప్పి,ప్రేమలోకి దించి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని, తమకు న్యాయం చేయాలని ప్రియుడు ఇంటి ఎదుట మౌన పోరాటాన్ని కొనసాగించారు