రాయదుర్గం: రైలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
రైలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం మద్యాహ్నం రాయదుర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం కొంతానపల్లి గ్రామానికి చెందిన చిత్రయ్య అనే యువకుడు రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడి చేయి శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపారు.