పీలేరులో జాతీయ క్యాన్సర్ డే అవగాహన ర్యాలీ:
ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ : డాక్టర్ చంద్రశేఖర్
పీలేరులో జాతీయ క్యాన్సర్ డే సందర్భంగా వైద్య సిబ్బంది శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ మరియు పి హెచ్ సి తలుపుల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన "జాతీయ క్యాన్సర్ దినోత్సవ" కార్యక్రమంలో వివిధ విభాగాల వైద్య నిపుణులు పాల్గొని క్యాన్సర్ నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులకు క్యాన్సర్ రకాలు, వాటి తీవ్రత, లక్షణాలు, చికిత్స మొదలగు అంశాలపై అవగాహన కల్పించి,సాధారణ స్థాయికి మించి శరీరముపై అసహజ కణాలను (కణితి) అనుమానించి వ్యాధి నిర్ధారణ సత్వర చికిత్సలు అవసరమని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు