నారాయణ్‌ఖేడ్: సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు పంపించే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దు: నారాయణఖేడ్‌లో ఎస్ఐ పి. విద్యా చరణ్ రెడ్డి హెచ్చరిక
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని నారాయణఖేడ్ ఎస్సై పీ. విద్యాచరణ్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకొని సోషల్ మీడియా యూజర్లను బురిడీ కొట్టించి డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. కావున ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. ఫోన్లకు వచ్చే ఓటీపీలను ఇతరులకు చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ ఫై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.