నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు 60 సంవత్సరాల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు, స్థానికుల వివరాల మేరకు కడప జిల్లా ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన రామాంజనేయులు ఆయన కుమారుడు అహోబిలం వెళ్లారు, దర్శనం చేసుకుని తిరిగి బైక్ పై వస్తుండగా హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న కారు బైక్ ను ఢీ కొట్టింది, ఈ ఘటనలో రామాంజనేయులు అక్కడికక్కడే మరణించగా ఆయన కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు