రాజపేట: గంధమల్ల చెరువు నుండి జీవనోపాధి కోసం మట్టిని తరలిస్తున్నాం, ఎమ్మెల్యే కు ఎలాంటి సంబంధం లేదు: సల్లూరు గ్రామస్తులు
యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, సల్లూరు గ్రామంలోని గంధమల్ల చెరువు నుండి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గ్రామస్తులు స్పందించారు. శుక్రవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ.. చెరువులోని భూమి అనుభవశిఖం ద్వారా పట్టా సంక్రమించిందని, గ్రామస్తులు అందరం జీవనోపాధి కోసం మట్టిని తరలిస్తున్నామని తెలిపారు. ఇందులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు రాజకీయ దురుద్దేశంతో అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని విమర్శించారు.