మార్కాపురం: చెన్నకేశవ స్వామి తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా చెన్నకేశవ స్వామిని ఆలయం నుండి కోనేటి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కోనేటిలో తెప్పపై స్వామిని వైభవంగా ఊరేగించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.