అరుణాచలం నుంచి శ్రీశైలం వరకు బైక్ పై యాత్ర చేస్తున్న తేజ అనే స్వామికి చెందిన బుల్లెట్ హంటర్ వైట్ బైక్ మహానంది క్షేత్రంలో శనివారం తెల్లవారుజామున చోరీకి గురైంది అరుణాచలం నుంచి బయలుదేరిన తేజ స్వామి మార్గమధ్యంలో కాణిపాకం అహోబిలంలోని నవ నరసింహస్వామి దర్శించుకుని మహానంది క్షేత్రానికి వచ్చి మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి బస చేసి శనివారం ఉదయం శ్రీశైలం కి బయలుదేర వెళ్లాల్సిన సమయంలో బైక్ కనిపించకపోవడంతో ఆందోళన గురై చుట్టుపక్కల ప్రాంతాల్లో గలించగా బైకు జాడ లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు తేజ స్వామి