మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద శ్రీను అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. ఒంగోలు జిల్లా జైలు నుండి బెయిల్ పై భార్యా బామ్మర్ది కారులో తీసుకువచ్చి ప్రణాళిక ప్రకారం హత్య చేశారు. అనంతరం పెద్దారవీడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.మృతుడు గంజాయి పేకాట బెట్టింగ్ తదితర అలవాట్లకు గురై సుమారు 25 లక్షల రూపాయల దాకా అప్పు చేయడమే కాకుండా భార్యను వేధిస్తున్నాడని దీంతో హత్య చేశామని భార్య బామ్మర్ది పోలీసు విచారణలో వెల్లడించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.