మిర్యాలగూడ: జిపిఓలు బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలి:సబ్ కలెక్టర్ నారాయణ అమిత్
నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలోని గ్రామాలలో జిపిఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ బుధవారం అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని బుధవారం నిర్వహించిన 3 రోజుల జీపీఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రజా సంక్షేమంలో భాగంగా రెవెన్యూ శాఖ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని సూచించారు.సమర్థవంతంగా విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలన్నారు. అంకితభావం నిజాయితీతో పని చేయాలని జిపిఓ లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.