తాడికొండ: మేడికొండూరులో రూ.1.91లక్షల నగదు సీజ్
మేడికొండూరులో రూ.1.91లక్షల నగదు సీజ్ మేడికొండూరులో శుక్రవారం పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాలను తనిఖీలు నిర్వహించారు. కొర్రపాడు చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో గుంటూరుకు చెందిన ఏసుబాబు కారులో రూ. 1.91 లక్షలను గుర్తించారు. సరైన పత్రాలు చూపకపోవడంతో ఆ నగదును జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సూర్య ప్రకాష్ రావు, సిబ్బంది పాల్గొన్నారు