మెదక్: ఆర్విఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు
Medak, Medak | Sep 19, 2025 నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఆర్విఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్విఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ వైద్య శిబిరంలో బీపీ,షుగర్, థైరాయిడ్, ఇలాంటి వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించడం జరిగిందని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి కృషి చేసిన నిజాంపేట ప్రెస్ క్లబ్ టీం సభ్యులను అభినందించారు.