మంత్రాలయం: టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: టిడిపి సీనియర్ నాయకులు వెంకటపతిరాజు
కౌతాళం: మండల కేంద్రంలో టిడిపి నాయకులు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సీనియర్ నాయకుడిని అని చెప్పుకొని ఓ వ్యక్తి నియోజవర్గ ఇన్చార్జి పై విమర్శలు చేయడం క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే ముఖాముఖి ద్వారా చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి అంతేగానీ ఇలా పార్టీ పై రుద్ది,పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే విధంగా విమర్శలు చేస్తే మాత్రం సహించబోమని టిడిపి సీనియర్ నాయకులు వెంకటపతి రాజు అన్నారు.