కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలం కొండాపురం గ్రామం శివారులోని పంపు హౌస్- చిత్రావతి రైల్వే బ్రిడ్జి మధ్యలో శుక్రవారం రాత్రి రైలు కిందపడి వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెల్పిన సమాచారం మేరకు మృతుడు కొండాపురం మండలం లావనూరుకి చెందిన మహేశ్ (28)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.