పలమనేరు: గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు పురుషుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు, వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి
పలమనేరు: పట్టణ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ డేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెద్దపంజాణి మండలం రామాపురం గ్రామం వద్ద గంజాయి విక్రయిస్తున్న మస్తాన్ శ్యామల అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసే రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల 100 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని విలువ సుమారు 31,000 ఉంటుందన్నారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న సాగు చేస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు మురళీమోహన్ పరశురాముడు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.