ఆందోల్: ఆందోల్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సమావేశం, మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్
సంగారెడ్డి జిల్లా అందోల్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా రైతులను ఆగం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందంట మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.