వర్ని: జీఎస్టీ నుండి బీడీ పరిశ్రమను తొలగించాలి మోస్రా లో టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జి ఎస్ టి నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం 3 గంటలకు మోస్రా మండల కేంద్రంలో బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా వస్తు సేవల పన్ను పేరా ప్రజల పైన విపరీతమైన భారాన్ని మోపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాలుగు స్లాబులను రెండు స్లాబులుగా చేశారని ఆరోపించారు. ఈపీఎఫ్ కార్మికులకు 9 వేల పింఛన్ ఇవ్వాలని,రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు 4 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలన