ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో ప్రజలు 41 ఫిర్యాదులను ఫోను ద్వారా ఎస్పీకి అందించారు. ఉదయం 11:30 నుంచి 12: 30 నిమిషాల వరకు జరిగిన కార్యక్రమంలో బాధితులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఫోన్లో మాట్లాడారు. వారు ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత ప్రాంతాల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఫిర్యాదుదారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.