చిలకలూరిపేట సమీపంలోని చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
చిలకలూరిపేటలో చెన్నై- కలకత్తా జాతీయ రహదారిపై గురువారం రాత్రి 8గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందారు. చిలకలూరిపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. తిరుపతికి చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ కేదర వెంకట కిషోర్ (42), అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కుమార్తె అశ్విత (7) ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పల్నాడు జిల్లా,చిలకలూరిపేట, మండలం తాతపూడి గ్రామం బైపాస్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడు డాక్టర్ కేదర వెంకట కిషోర్ భార్య తంగిళ్ళ సంధ్య మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ తంగిళ్ళ సంధ్య తోపాటు ఇద్దరు పి