నిర్ణీత గడువులోగా అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి - జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 251 అర్జీలు రాగా సంబంధిత అధికారులు పరిష్కారం చేయాలని ఆయన ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.