కొండపి: కంభం చెరువు అలుగు కాలువ ఆక్రమణకు గురి కావడంతోటే పంటలు నీట మునిగాయి: స్థానిక రైతులు
ప్రకాశం జిల్లా కంభం మండలంలో కంభం చెరువుకు సంబంధించిన చిన్న అలుగు పారే కాలువ ఆక్రమణల కారణంగా పంటలు నీట మునిగాయని స్థానిక రైతులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంభం చెరువుకు వరద నీరు వచ్చి చేరడంతో, అలుగు పారుతూ పంట పొలాలను ముంచేసిందని రైతులు తెలిపారు. పెద్ద అలుగులో కంపచెట్లు తొలగించి, చిన్న అలుగు కాలువ ఆక్రమణలను అధికారులు కొలతలు వేసి పునరుద్ధరిస్తే పంటలు మునిగే అవకాశం లేదని ఒక రైతు పేర్కొన్నారు.