అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని వజ్రకరూరు మండల కేంద్రానికి అత్యంత సమీపంలో రహదారిపై కుక్క అటు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలు కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.