వికారాబాద్: మున్సిపల్ పరిధిలోని అనంత బార్ అండ్ రెస్టారెంట్ లోఆహార పదార్థాలలో పురుగుల కలకలం, పదివేల ఫైన్
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో బస్టాండ్ వద్ద ఉన్న అనంత బార్ అండ్ రెస్టారెంటలో తినే ఆహార పదార్థాలలో కస్టమర్ పురుగులను గమనించాడు. టేబుల్ పై ఉన్న ఉప్పు కారంలో కూడా పురుగులు కనిపించాయని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి తనిఖీ చేయగా ఫ్రిజ్లో నిలువ ఉంచిన పదార్థాలను పరిశీలించగా అందులో పురుగులు ఉన్నాయని నిలువ పదార్థాలు వాడవద్దని హెచ్చరించి పదివేల ఫైన్ తో చేతులు దులుపుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడ వద్దని రెస్టారెంట్ యజమాని హెచ్చరించినట్లు తెలిపారు.