కుప్పం: ఏడేళ్ల తర్వాత పరవళ్లు తొక్కుతున్న పాలారు నది
కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులో ప్రవహించే పాలారు నది ఏడేళ్ల తర్వాత కుప్పం నియోజకవర్గంలో పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పాలారు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శాంతిపురం వద్ద పాలారు చెక్ డాం నిండి మరవ పోతుంది. మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పాలారు నదికి మరింత వరద రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.