కొండపి: కొండపి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో చెడు నడతల ప్రవర్తన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడతల ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ఆదివారం స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రవర్తన మార్చుకొని ప్రజలతో స్నేహంగా మెలగాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. గతంలో గొడవలకు దిగి దాడులకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని చెడు నడతల ప్రవర్తన కలిగిన వ్యక్తులను గుర్తించడం జరిగిందని నిరంతరం వారిపై నిఘ ఉంచడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.