అనంతపురం నగరంలోని చెరువు కట్ట సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో లక్ష్మీపతి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.