జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా గస్తీలు, పెట్రోలింగ్ చేపట్టిన పోలీసులు
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి పోలీసులు ముమ్మరంగా గస్తీలు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు.