యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారికి శతఘటభిషేకం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రమును పురస్కరించుకొని శతఘటభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం ప్రధాన కలశం బిందు తీర్థంతో గర్భాలయం ప్రతిక్షణ చేశారు. అనంతరం 108 కళాశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంభు మూర్తులకు అభిషేకం నిర్వహించారు .భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని చెల్లించుకున్నారు.