పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో భారీ కొండచిలువ హల్ చల్
శ్రీకాళహస్తిలో భారీ కొండచిలువ కలకలం శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కాలనీలో శనివారం రాత్రి భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. అది దాదాపు పది అడుగుల పొడవు ఉండడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు కొండ చిలువను కొట్టి చంపి వేశారు. కొండ ప్రాంతం కావడంతో తరచూ పాముల బెడద ఎక్కువగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.