సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని అంబర్‌పేట పోలీసులు శనివారం హెచ్చరించారు. ఇటీవల కొత్త ఫ్లైఓవర్‌పై చైనా మాంజా కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచినట్లు పోలీసులు తెలిపారు. పండుగకు ఊరు వెళ్లే వారు ముందస్తుగా తమ ప్రాంత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఖాళీ ఇళ్లపై దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.