ఇబ్రహీంపట్నం: లింగోజిగూడ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పున: ప్రతిష్టస్తాం: లింగోజిగూడ కార్పోరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా లింగోజిగూడ చౌరస్తా లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని యువకుడు ధ్వంసం చేశాడు. ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. గంజాయి సేవించే యువకుడు ధ్వంసం చేశాడని వెంటనే స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాలన్నారు. లింగోజిగూడ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పున: ప్రతిష్టిస్తామన్నారు.