సిరిసిల్ల: బతుకమ్మ, పండగలకు ఊరికి వెళ్లే వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి: వీర్నపల్లి ఎస్సై లక్ష్మణ్
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల ప్రజలు దసరా పండుగ ఊరికి వెళ్లే ముందు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై లక్ష్మణ్ మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు విహారయాత్రలకు వెళ్లే ఆయా గ్రామాల కాలనీ అపార్ట్మెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. పండుగ సందర్భంగా దొంగతనాల నియంత్రణకు గ్రామాల్లో పట్టణాల్లో చేయడం జరుగుతుందని దీనికి అనుగుణంగా జిల్లా ప్రజలు పోలీస్ సలహాలు సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.