ఆళ్లగడ్డ మండలం ఆర్. కృష్ణాపురంలో గ్రామంలో దారుణ హత్య
ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మేడపై నిద్రిస్తున్న ఓలమ్మ (40) అనే మహిళను భర్త శేషగిరిరావు ఇటుకలతో తలపై కొట్టి, మేడ పైనుంచి తోసి హత్య చేసినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.