పిచ్చాటూరులో మూడు టిప్పర్లు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు
పిచ్చాటూరు: మూడు టిప్పర్లు స్వాధీనం తిరుపతి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీముల్లా ఆదేశాలతో విజిలెన్స్ సిబ్బంది మంగళవారం పిచ్చాటూరు నుంచి ఊతుకోట వరకు వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎం. సాండ్తో వెళుతున్న మూడు టిప్పర్లను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేనందున వాటిని స్వాధీనం చేసుకొని పిచ్చాటూరు పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు ప్రాంతీయ నిఘా విభాగం అధికారులు తెలిపారు.