పులివెందుల: నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా వైకాపా కోటి సంతకాల కార్యక్రమం
Pulivendla, YSR | Oct 29, 2025 పులివెందుల నియోజకవర్గం లోని పులివెందుల వేంపల్లి సింహాద్రిపురం తొండూరు చక్రాయపేట మండలాల్లో వైకాపా మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా మద్దతు కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.