రాయదుర్గం: బొమ్మనహాల్ లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న సూర్యకళ చికిత్స పొందుతూ మృతి
బొమ్మనహాల్ ఎంపిపి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న సూర్యకళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంక్రాంతి సెలవులు రావడంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎంఈవో, ఇతర సిబ్బంది, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.