తాడేపల్లిగూడెం: ఆర్డీవో కార్యాలయంలో ఉమ్మడి కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన బొలిశెట్టి శ్రీనివాస్.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉమ్మడి పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూటమికే పట్టం కడతారని అన్నారు తాడేపల్లిగూడెంలో ఉన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి ఇన్చార్జ్ ఈతకోట తాతాజీ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు