నిర్మల్: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో తెగిపోయిన పెద్ద చెరువు కట్ట, దిగువన ఉన్న పంట పొలాల్లోకి వెళ్తున్న చెరువు నీరు
Nirmal, Nirmal | Sep 16, 2025 సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని పెద్ద చెరువు కట్ట మంగళవారం తెగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు తూము వద్ద కట్ట బలహీనంగా మారింది. దీనికి తోడు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి తూము వద్ద బుంగ ఏర్పడి కట్ట పూర్తిగా తెగిపోయింది. దీంతో చెరువులోని నీరంతా దిగువన ఉన్నా పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. గ్రామస్తులు వెంటనే ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత ప్రభుత్వంలో రూ. 78 లక్షలతో మిషన్ కాకతీయ కింద చెరువు పూడికతీత పనులు చేపట్టినప్పటికీ కట్టను పటిష్టం చేయలేదు. భారీగా కురిసిన వర్షానికి చెరువు పూర్తిగా నిండుకొని తెగిపోయి రైతులకు నష్టం చేకూర్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశ