పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిధ దళాల కవాతు
Eluru, Eluru | Mar 28, 2024 ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు, ఏలూరు త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ వి. వెంకటేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది గురువారం సాయంత్రం ఏలూరు 3 టౌన్ పరిసర ప్రాంతాలలో సాయిద దళాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ వి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజలు వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటును వినియోగించుకోవడానికి కావలసిన మౌలిక సదుపాయాలను పోలీస్ శాఖ అందిస్తుందని తెలిపారు.