ఆళ్లగడ్డ పట్టణములోని శ్రీ అమృత లింగేశ్వర స్వామి ఆలయంలో, కార్తీకదీపం వెలిగించిన మహిళలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ అమృత లింగేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో సోమవారం రాత్రి కార్తీక మాసం త్రయోదశి పర్వదినం సందర్భంగా శ్రీ అమృత లింగేశ్వర స్వామి వారికి, అమ్మవారికి వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని ఎగురవేశారు.