మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇటీవల పలు ఫిర్యాదులు అందాయని హైదరాబాద్ రేంజ్ ఏసిబి డిఎస్పి గంగసాని శ్రీధర్ అన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు ఉన్న సబ రిజిస్టార్ కార్యాలయాలపై ఆకస్మిక సోదరులు నిర్వహిస్తున్నామన్నారు. వారికి ఉన్న సందేహాలపై పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. ఉదయం వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు.