ప్రకాశం జిల్లా హనుమంతుడిపాడు మండలంలోని గొల్లపల్లి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి ఆలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పది లక్షలు విరాళముగా ఇచ్చిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే కమిటీ సభ్యులతో అన్నారు.