గంగాధర నెల్లూరు: GD నెల్లూరు పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ
GDనెల్లూరు పోలీస్ స్టేషన్లో ఆయుధపూజను ఆదివారం నిర్వహించారు. CI వాసంతి ఆధ్వర్యంలో దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో వేడుకలు చేశారు. వాహనాలు, కంప్యూటర్లు, తుపాకులకు పూజలు జరిగాయి. మండల పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతల నడుమ ప్రజలు జీవించాలని CI కోరారు.