మిన్నంరెడ్డిగారి పల్లిలో వీధి కుక్కలు దాడి, తీవ్రంగా గాయపడిన లేగదూడ
మిన్నంరెడ్డిగారి పల్లిలో వీధి కుక్కలు దాడి చేయడంతో లేగదూడ తీవ్రంగా గాయపడింది.కేవి.పల్లి మండలం సొరకాయలపేట పంచాయతీ మిన్నమరెడ్డిపల్లికి చెందిన రైతు కృష్ణవేణి తన ఇంటి వద్ద కట్టేసిన నాలుగు నెలల లేగదూడ పై మంగళవారం సాయంత్రం వీధికుక్కల గుంపు దాడి చేసి 2 చెవులను కొరికేశాయి.దీంతో లేగదూడ తీవ్రంగా గాయపడింది. గాయపడిన దూడను చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, రాత్రివేళ బయటకు వెళ్లడానికి కూడా భయమేస్తోందని" ఆవేదన వ్యక్తం చేశారు.దీని పై అధికారులు దృష్టి సారించి వీధి కుక్కలను నివారించాలని కోరుతున్నారు